Skip to main content

Posts

Showing posts from October, 2018

Gifts for Kids in the Fred O' Neal's Christian Children's Home

King Saul's errors - తండ్రియే శత్రువైతే...! [1వ సమూయేలు 20:30-34]

1వ సమూయేలు 20:30-34 ప్రభువునందు మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. దేవుని గ్రంధములో మనమనేక ఆత్మీయవిషయములను నేర్చుకొనగలము. మన అత్మీయస్థితి ఉన్నతంగా ఉంచుకోవటానికి అనేక సంగతులు, ఉదాహరణలు, దృష్టాంతములు, హెచ్చరికలు వగైరాలు వ్రాయబడియున్నాయి. పైన పేర్కొన్న వాక్యభాగములో ఒకని తండ్రే తన కుమారునికి శత్రువుగా మారి, చంపుటకు ప్రయత్నించిన సందర్భమును తెలుసుకుందాము. ఇక్కడ, ఇశ్రాయేలీయుల మొట్టమొదటి రాజైన సౌలు, అతని మొదటి కుమారుడైన యోనాతానును చూడవచ్చు. ఈ తండ్రికొడుకులు ఎందువలన ఆ పరిస్థితిలోనికి వెళ్ళారో గమనిస్తే కొన్ని ఆసక్తికరమైన సంగతులను విశ్లేషించగలము. అవేంటంటే, 1) అసూయ 2) స్నేహం 1) అసూయ :- దావీదు ఫిలిష్తీయుడైన గొల్యాతును చంపడమువలన ప్రజలలో సౌలు రాజు కంటే ఎక్కువ పేరు సంపాదించుకున్నాడు. సౌలు వేలకొలది, దావీదు పదివేలకొలది అనే మాటలు అస్సలు గిట్టలేదు. తనకంటే గొప్ప పేరు దావీదునకు రావడంవలన తన హృదయములో క్రోధం, ఆగ్రహం & ద్వేషభావం పెంచుకుంటూ ఉన్నాడు. ఎంత అంటే, దావీదును తన ఈటెతో గోడకు దించి చంపుదామన్నంత. అయినా దావీదు సౌలుయొక్క ద్వేషమును ఎరుగక, రాజుకొలువులో తన పని తాను చేసుకుంటూ ఉన్నడు....